🇮🇳 ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 🌐
ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కలను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. 🚺 తెలంగాణలో ఆడబిడ్డలకే కాకుండా వికలాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 🌍 నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
💼 100 ఉద్యోగాల ఉంటే 33 ఉద్యోగాలు కచ్చితంగా మహిళలకు వస్తాయని, అదనంగా మరన్ని ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉండేదని వివరించారు. 📊 ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హారిజాంటర్ రిజర్వేషన్లు అమలు చేస్తూనే రోస్టర్ పాయింట్లు ఎత్తివేయడానికి జీవో 3ని తీసుకొచ్చిందని, 33 కంటే తక్కువ ఉద్యోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 🚺 ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 👩⚖️ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలపై పెట్టే దృష్టి రోస్టర్ పాయింట్లపై పెట్టి ఉంటే ఈ రోజు ఆడబిడ్డలకు అన్యాయం జరిగేది కాదని అన్నారు. 📜 ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో3ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. 🛡️ జీవో 3ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో సోనియా గాంధీ చెప్పాలన్నారు. 📢 జీవోను వెనక్కి తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని సోనియా గాంధీకి కవిత విజ్ఞప్తి చేశారు. 🗣️🌍✊