📸🎉 ఇన్‌స్టాగ్రామ్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది రీల్స్. 📺📢 భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్‌స్టా రీల్స్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. 🌟
యూత్ భారీగా రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసే రోజులు వచ్చాయి. 😃📲📈 ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇన్‌స్టా రీల్స్ టైం పరిమితి కేవలం 90 సెకండ్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. 🕒 అయితే ఇన్‌స్టా ఈ సమయాన్ని పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 🤷♂️👁️👥 రీల్స్ టైం పరిమితిని 10 నిమిషాలకు పెంచేందుకు మెటా ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 🧐 అయితే మెటా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 🚫
🌐📺 ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సమయాన్ని 10 నిమిషాలకు పెంచడం ద్వారా ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్‌కు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఇన్‌స్టా ఉన్నట్లు తెలుస్తోంది. 📹🎬
ప్రస్తుతం షార్ట్ వీడియోల్లో అత్యధికంగా సమయాన్ని అందిస్తోంది టిక్‌టాక్ మాత్రమే. 10 నిమిషాల కంటే ఎక్కువ నిడివిగల వీడియోలను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని టిక్‌టాక్ తన యూజర్లకు అందిస్తోంది. 🤳🎥