top of page
MediaFx

ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి..

సందీప్ రెడ్డి వంగ.. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డ్ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటాడు సందీప్ రెడ్డి. తోలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమానే బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే టైటిల్ తో రీమేక్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ లోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ రెడ్డి వంగా బిజీ అయ్యాడు. తాజాగా సందీప్ రెడ్డి వంగ  ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన త్వరలోనే ఓ బయోపిక్ తెరకెక్కిస్తా అని అన్నారు.

ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగకు మంచి డిమాండ్ ఏర్పడింది .  సందీప్ తో సినిమా చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ  ఆసక్తికర కామెంట్స్ చేశారు. మైఖేల్ జాక్సన్ జీవిత కథపై సినిమా చేయాలనుందని సందీప్ అన్నారు.

‘మైఖేల్ జాక్సన్ సినిమా చేయాలన్న కోరిక ఉంది. అయితే మైఖేల్ జాక్సన్ పాత్రను ఎవరు పోషిస్తారనేది ప్రశ్న. సరైన హీరో దొరికితే హాలీవుడ్‌లో సినిమా తీయొచ్చు. మైఖేల్ జాక్సన్ జీవితం చాలా ఆసక్తికరంగా సాగింది. అతని చిన్ననాటి రోజులు, స్టార్ గా ఆయన ప్రయాణం. అదంతా పెద్ద సినిమా అవుతుంది. ఆ సినిమా తీస్తే అందరూ ఎగబడి చూస్తారు.. మైకేల్ బయోపిక్ ను ఎవరైనా డైరెక్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది.. లేదా కరెక్ట్ హీరో దొరికితే నేనైనా డైరెక్ట్ చేస్తా.. అని అన్నారు సందీప్ రెడ్డి. అలాగే ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ..   ఈ సినిమా తొలిరోజే 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అన్నాడు. దాంతో స్పిరిట్ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


bottom of page