మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్‌తో స్నేహం బెడిసి కొట్టడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టాలని వామపక్షాలు భావించాయి. 🤝
ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఐ మునుగోడు స్థానాన్ని అడిగింది. 🤔 కానీ మొన్నటి వరకు నాన్చివేత ధోరణితో వ్యవహరించిన కాంగ్రెస్, రెండో జాబితాల్లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రకటించింది. 📢 దీంతో ఖంగుతిన్న సిపిఐ.. మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్‌కు సిద్ధమైనట్లు సమాచారం. 📰
మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. 🏡 పార్టీలో వర్గపోరు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీల కంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో ముందున్నారు. 📣 మొత్తం మీద ఎన్నికల బరిలో నిలవబోయే అభ్యర్థులు పార్టీ కండువాలు మార్చుతుండటంతో మునుగోడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 🌟"