భువనగిరిలో అంతర్జాతీయ టెన్నిస్ క్రీడలు షురూ
- MediaFx
- Aug 26, 2024
- 1 min read
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూడైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజనర్సింహారావ్ మెమోరియల్ అంతర్జాతీయ జూనియర్స్ జె 6- అండర్-18 టెన్నిస్ క్రీడలు ఆదివారం అట్టహాసంగా మొదలయ్యాయి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను ప్రారంభించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల నుంచి 17 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 8 కోర్టులను ఏర్పాటు చేయడం అభినందనీయమని కుంభం అన్నారు.