top of page
MediaFx

తొలి విజయంతో 2 ప్రపంచ రికార్డ్‌లు ముంబై సొంతం..

టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 13 వేలకు పైగా మ్యాచ్‌లు జరిగాయి. ఐపీఎల్‌లోనే 1200కు పైగా మ్యాచ్‌లు ఆడారు. అయితే గతంలో ఎన్నడూ చూడని, వినని రీతిలో ఈసారి ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన చేసింది. ఈ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది.

వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. విశేషమేమిటంటే.. ఇంత భారీ మొత్తం పరుగులు రాబట్టినా.. ముంబై ఇండియన్స్ తరపున ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయకపోవడం.

రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), హార్దిక్ పాండ్యా (39), టిమ్ డేవిడ్ (45), రొమోరియో షెపర్డ్ (39) రాణించడంతో ముంబై ఇండియన్స్ 234 పరుగులు చేయగలిగింది. దీంతో పాటు టీ20 క్రికెట్ చరిత్రలో హాఫ్ సెంచరీ లేకుండానే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ ఘనతను పంచుకుంది.

ఈ మ్యాచ్‌లో 234 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ టీ20 క్రికెట్‌లో 150 మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచంలోనే తొలి జట్టుగా కూడా నిలిచింది. ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో కూడా అగ్రస్థానంలో ఉంది.

ఓవరాల్‌గా హ్యాట్రిక్ ఓటమితో షాక్‌కు గురైన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు భారీ విజయంతో పునరాగమనం చేయగా, ఈ పునరాగమనంతో 2 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ :

డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్‌సన్, రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ :

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.

bottom of page