ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు, ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. దీని తర్వాత, కొత్త కెప్టెన్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి సీజన్‌లోని మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. తన కెప్టెన్సీలో ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా మార్చిన ధోని ఈ మ్యాచ్‌లో ఆటగాడిగా ప్రవేశించి వికెట్ల వెనుకాల తన మ్యాజిక్‌ను కొనసాగించాడు.
ఐపీఎల్ 2024 ధోనీకి చివరి సీజన్‌గా పరిగణిస్తున్నారు. ధోనీకి సంబంధించి ఒక వెటరన్ బ్యాట్స్‌మెన్ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. దాని ప్రకారం అతను ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడడు. లీగ్ మధ్యలో విరామం తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ధోని గురించి వెస్టిండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ చెప్పిన మాట ఇది. CSK వర్సె్స్ RCB మధ్య సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు గేల్ ఈ ప్రకటన చేశాడు.
ఐపీఎల్ మధ్యలో ధోనీకి బ్రేక్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ స్టార్ గేల్, ధోనీ మ్యాచ్ మొత్తం ఆడడని, అతను స్వల్ప విరామం తీసుకోవచ్చని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీని గైక్వాడ్‌కు అప్పగించాడని అభిప్రాయపడ్డాడు.గేల్ మాట్లాడుతూ..’అతను బహుశా అన్ని మ్యాచ్‌లు ఆడడు. టోర్నమెంట్ మధ్య స్వల్ప విరామం తీసుకోవచ్చు. అందుకే కెప్టెన్ పదవిని గైక్వాడ్‌కు అప్పగించాడు. ఈ నిర్ణయం తీసుకున్నా ధోనీ మాత్రం బాగా రాణిస్తాడు. దీని గురించి చింతించకండి’ అంటూ తెలిపాడు.
ధోని రిటైర్మెంట్ గురించి గత సీజన్ నుంచి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కానీ, మోకాలి గాయంతో ఉన్నప్పటికీ, అతను సీజన్ మొత్తం ఆడి 5వ సారి జట్టును ఛాంపియన్‌గా నిలిచాడు. ఇది మాత్రమే కాదు, అతను గత సీజన్‌లో 2024లో కూడా ఆడతానని అభిమానులకు హామీ ఇచ్చాడు.