top of page
Suresh D

కింగ్ కోహ్లీకి పీడకలలా మారిన బుమ్రా..!

ముంబైలోని వాంఖడే మైదానంలో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య హైవోల్టేజీ ఫైట్ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 

ఈ సీజన్‌లో RCB తరుపున బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లి ముంబై ఇండియన్స్‌పై సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 3 పరుగులు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో కోహ్లీపై బుమ్రా తన జోరును కొనసాగించి రికార్డు స్థాయిలో ఐదోసారి రన్ మెషీన్ వికెట్‌ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మూడో ఓవర్‌ బౌలింగ్‌ బాధ్యతలు చేపట్టిన జస్‌ప్రీత్‌ బుమ్రా.. విరాట్‌ కోహ్లీని బౌల్డ్‌ చేశాడు. బుమ్రా వేసిన బంతిని కొట్టేందుకు విరాట్ ప్రయత్నించాడు. కానీ, బంతి అతని బ్యాట్ లోపలి అంచుకు తగిలి ఇషాన్ కిషన్ చేతుల్లోకి వెళ్లింది. 

నిజానికి విరాట్ కోహ్లీ, బుమ్రా మధ్య పోరు ఇప్పటిది కాదు. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన బుమ్రా.. తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ రూపంలో తొలి వికెట్‌ని సాధించాడు. అప్పటి నుంచి జస్ప్రీత్ బుమ్రా వెనుదిరిగి చూసుకోలేదు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో చాలాసార్లు తలపడ్డారు. ఇందులో విరాట్ కోహ్లీకి జస్ప్రీత్ బుమ్రా ఐదోసారి పెవిలియన్ బాట చూపించాడు. విరాట్ కోహ్లీ బుమ్రాపై 147.36 స్ట్రైక్ రేట్‌తో 95 బంతుల్లో 140 పరుగులు చేశాడు.

bottom of page