top of page
MediaFx

అమెరికాకు ఇరాన్ వార్నింగ్..

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై ప్రతి దాడికి ఇరాన్‌ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌.. అమెరికాను హెచ్చరించింది.

తాము ఇజ్రాయిల్‌పై యుద్ధానికి దిగబోతున్నామని.. ఈ విషయంలో అమెరికా దూరంగా ఉండాలని వార్నింగ్ జారీ చేసింది. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఇరాన్ సందేశం పంపింది. యుద్ధం విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని.. అప్పుడే మీరు సురక్షితంగా ఉండగలరని అమెరికాకు ఇరాన్ తెలిపింది. ఇరాన్ హెచ్చరికలపై అమెరికా స్పందించింది. తమ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయరాదని కోరినట్లు ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల అధికారి మొహమ్మద్ జంషిది తెలిపారు. కానీ అమెరికా మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరీ ఇరాన్ హెచ్చరికలపై యూఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. సిరియా రాజధాని దమాస్క్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇటీవల వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు మిలిటరీ కమాండర్లతో పాటు పాటు 13 మంది మరణించారు. మరోవైపు ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చెప్పారు. ఇరాన్‌ దాడులకు దిగుతుందనే భయంతో ఇజ్రాయిల్‌ అప్రమత్తమైంది. జీపీఎస్‌ నావిగేషన్‌ను నిలిపివేసింది. తమ సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. రక్షణ సామర్ధ్యాన్ని విస్తరించింది. తన సరిహద్దులన్నింటిలో బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్తగా అన్నిచోట్ల బాంబు షెల్టర్‌లను తెరిచింది.


bottom of page