top of page
Suresh D

‘పుష్ప – 2’ ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా..?🎥✨

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప 2’ టీజర్ విడుదల కానుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాకముందే జరగబోయే ప్రమోషన్స్ కి ఈ టీజర్ వేదికకానుంది. ఇక విషయానికి వస్తే కేజీఎఫ్ 2, పుష్ప 2 (రెండూ సీక్వెల్స్) బాక్సాఫీస్ క్లాష్ కానప్పటికీ, కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ రికార్డ్ సాధించడం చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ 2 టీజర్ 275 మిలియన్ వ్యూస్ తో ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు మోస్ట్ లైక్స్ పొందిన టీజర్ గా నిలిచింది. మరే భారతీయ సినిమా టీజర్ కూడా ఈ టీజర్ కు దగ్గరగా లేదని టాలీవుడ్ టాక్.దీంతో యూట్యూబ్ లో కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ రికార్డ్ ను పుష్ప 2 టచ్ చేయగలదా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే పుష్ప మూవీ ఊహించినదాని కంటే హిట్ అవ్వడం, అల్లు అర్జున్ నటన హైలైట్ గా నిలవడంతో ఈ రికార్డు కొట్టడం సాధ్యమేనని భావిస్తున్నారు సినీ క్రిటిక్స్. 🎥✨

bottom of page