top of page
MediaFx

అమెరికా హెచ్చరికతో దిగొచ్చిన ఇజ్రాయెల్

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలోకి మరింత మానవతా సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్‌కు అమెరికా తేల్చిచెప్పింది. లేదంటే భవిష్యత్తులో తమ సాయం నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించింది.



bottom of page