పవన్ కళ్యాణ్ పొలిటికల్ సక్సెస్ కాలేకపోయినా.. నటుడుగా మాత్రం సూపర్ సక్సెస్. హిట్‌లు ఫ్లాప్‌లు పక్కనపెడితే.. అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ.. పవన్ కళ్యాణ్‌కి మాత్రం భక్తులు ఉంటారు. ఆ భక్తిని లెక్కకట్టాలంటే ఎక్కాలు సరిపోవు. అది అభిమానమా? లేదంటే పిచ్చా.. ఇంకా ఇంకా ఏదైనా అనుకునే వాళ్లు అనుకుంటూనే ఉంటారు కానీ.. పవన్ కళ్యాణ్‌ని అభిమానించే ఫ్యాన్స్ మాత్రం.. అతని కోసం ప్రాణం పెట్టడానికైనా వెనకాడరు. తమ అభిమాన నాయకుడి కోసం గుడి కట్టడానికి రెడీగా ఉన్న పిచ్చ ఫ్యాన్స్ ఆయన ఉండటానికి ఇల్లు ఇవ్వడానికి సందేహిస్తారనుకుంటే పొరపాటే సుమీ.
పైగా పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని ప్రకటించేశారు కూడా. దానిలో భాగంగా.. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉగాది నాడు పాలు కూడా పొంగించేశారు. అయితే పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న ఆ విశాలమైన నాలుగు అంతస్థుల భవనం.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఓదూరి నాగేశ్వరరావుది కావడం విశేషం. గొల్లప్రోలు మండలం చెబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన పంట పొలాల్లో ఈ ఇల్లు ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇదే ఇంట్లో ఉంటున్నారు. కాగా ఈ ఇంటి పవన్ కళ్యాణ్ కోసం ఉచితంగా ఇచ్చినట్టు తెలిపారు పవన్ అభిమాని ఓదూరి నాగేశ్వరరావు. అయితే పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ఉండటంపై సంతోషం వ్యక్తం చేస్తూనాటు తెలియజేసారు. 🎥✨