top of page
MediaFx

జనసేన అభ్యర్థుల చేతికి బీఫాంలు..?

ఇంకో రెండు రోజుల్లో ఏపీలో నామినేషన్ల పర్వం ఆరంభం కాబోతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 18వ తేదీన తెరలేవబోతోంది.

నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. 26వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది. అధికారంలోకి వచ్చేదెవరనేది తేలేది అప్పుడే. 

నామినేషన్ల గడువు సమీపించిన నేపథ్యంలో- అన్ని పార్టీలు కూడా దీనిపై దృష్టి పెట్టాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. చివరి రోజు కావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. అదే రోజున నామినేషన్ వేస్తారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. తన పార్టీ అభ్యర్థులందరికీ నేడు బీఫాంలను అందజేయనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ మధ్యాహ్నం వారందరితో సమావేశం కానున్నారాయన. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమీక్షించనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. 


bottom of page