దేవర'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీ 👏దక్షిణాదిపై దృష్టి సారిస్తున్న బాలీవుడ్ బ్యూటీ 💃కొన్ని రోజులు హైదరాబాద్, కొన్ని రోజులు ముంబైలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న వైనం బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ వరుస సినిమాలు చేస్తూ దూకుడు మీద ఉంది 🎬
తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను జాన్వీ సొంతం చేసుకుంది 📸ఇప్పుడు దక్షిణాదిపై ఆమె దృష్టి సారించింది 👁️టాలీవుడ్ నుంచి ఆమె సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది 🎥'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె నటిస్తోంది 🎬కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చేపలు పట్టే కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రను జాన్వీ పోషిస్తోంది ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై, హైదరాబాద్ మధ్య తిరగడం ఆమెకు ఇబ్బందిగా మారిందట 🎥దీంతో, హైదరాబాద్ లో రూ. 3 కోట్లతో ఒక ఇంటిని ఆమె కొన్నట్టు సమాచారం 🏡 త్వరలోనే తన మకాంను హైదరాబాద్ కు మారుస్తుందని చెపుతున్నారు కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు ముంబైలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుందని సమాచారం సౌత్ లో బిజీ అయితే ఎక్కువ రోజులు ఉండేందుకు హైదరాబాద్ లో ఇంటిని కొనుగోలు చేసిందని చెపుతున్నారు