top of page
MediaFx

దేవర షూటింగ్ అంటే ఎందుకు అంత ఇష్టమో రివీల్ చేసి జాన్వీ కపూర్!


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘జాన్వీ కపూర్’.. గత కొన్ని రోజులుగా  ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో తరుచు వినిపిస్తునే ఉంది.అయితే ప్రస్తుతం ఈ చిన్నది వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీబిజీగా మారిపోయింది. ముఖ్యంగా జాన్వీ హిందీలో నటించిన ‘ఉలఝ్’ మూవీ ఈ ఆగస్టు 2వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా గురించి ఈ బ్యూటీ ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో జాన్వీ సుహానా అనే డిప్యూటీ హైకమిషనర్ పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ మూవీతో పాటు జాన్వీ  యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో  ‘దేవర’ సినిమాలో కూడా నటిస్తుంది. అయితే దేవర మూవీ రెండు పార్టులుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్నారు. ఇకపోతే దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.  కానీ, ప్రస్తుతానికైతే ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే  మూవీ టీమ్ ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కూడా తన అభిమానుల కోసం షూటింగ్ టైంలో  సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇంతకి అదేమిటంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించానున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. ఫ్యాన్స్ ను ట్రీట్ ఇస్తున్నారు మూవీ మేకర్స్. కానీ, ఈసారి మాత్రం అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఏకంగా దేవర షూటింగ్ సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ లో జాన్వీ దేవర షూటింగ్ బ్రేక్ లో భోజనం ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పైగా ఆ ఫోటోలో డైనింగ్ టేబుల్ పై బిర్యానీ, చికెన్ డిషెస్ తో పాటు పలు శాఖాహార వంటకాలున్న ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా.. ‘దేవర షూటింగ్ ఇందుకే ప్రేమిస్తున్నానంటూ’ ఫైర్, లవ్ ఎమోజీలను క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరీ, దేవర షూటింగ్ టైమ్ లో జాన్వీ షేర్ చేసిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


bottom of page