top of page
MediaFx

జాన్వీ కపూర్ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను అలరించనుంది’. ఆమె ఇప్పుడు దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాలో జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీ లుక్ ప్రేక్షకులను మెప్పించింది. లంగాఓణిలో పక్కింటి అమ్మాయిలా మెరిసింది జాన్వీ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించింది. మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమా చేసింది జాన్వీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ లో ఫొటోగ్రాఫర్ల గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. హిందీలో సెలబ్రెటీలు ఫొటోగ్రాఫర్లను డబ్బులిచ్చి పిలిపించుకుంటారని తెలిపింది జాన్వీ. బాలీవుడ్ లో ప్రతీదానికి ఓ రేటు ఉంటుందని.. అలాగే ఫొటోగ్రాఫర్లు కూడా డబ్బులు తీసుకుంటారని తెలిపింది జాన్వీ. అయితే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా షూటింగ్ లో భాగంగా తాను 25-30 సార్లు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాను కానీ ఫోటోగ్రాఫర్స్ నన్ను క్లిక్ మరిపించింది కేవలం 5 లేదా ఆరు సార్లు మాత్రమే.. ఎందుకంటే నాకు అలా ఫోటోలు తీయడం ఇష్టం లేదు. వారు మా కార్లను వెంబడించి మరీ ఫోటోలు తీస్తారు అని చెప్పుకొచ్చింది.

అలాగే మాట్లాడుతూ.. నేను జిమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తెగ ఫోటోలు తీస్తారు. వర్కౌట్స్ కోసం టైట్ దుస్తులు దరిస్తాం.. కానీ జనాలు నన్ను అలా టైట్ డ్రస్ల్‌ల్లో చూడటానికి అంతగా ఇష్టపడరు. నేను కూడా అలా ఫోటోలు దిగాలని అనుకోను.. అందుకే కొన్ని సార్లు జిమ్ లోపలే ఎక్కువ సమయం గడుపుతుంటాను. కానీ బయటకు రాగానే నన్ను ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు. నేను టైట్ డ్రస్ లో కనిపించగానే క్లిక్ మనిపిస్తారు. కానీ బయట జనాలు నేను బిగుతుగా డ్రస్ వేసుకుని కావాలనే ఫోటోలు దిగాను అని అనుకుంటారు అని జాన్వీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మే 31న విడుదల కానుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే సినిమా ఇది.

bottom of page