top of page
Suresh D

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తీ ‘జపాన్’ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..🌟🎥

ట్రైలర్ విడుదలతోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు కార్తి. డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్‏తో కడపుబ్బా నవ్వించాడు. దీపావళి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

కోలీవుడ్ హీరో కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు అతడు నటించిన సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే జపాన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. కార్తీ కెరీర్‏లో 25వ సినిమాగా వచ్చిన జపాన్ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి జోకర్ మూవీ ఫేమ్ డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించగా.. ఇందులో కార్తీ సరికొత్త పాత్రలో కనిపించారు. ట్రైలర్ విడుదలతోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు కార్తి. డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్‏తో కడపుబ్బా నవ్వించాడు. దీపావళి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

కొన్నిరోజులుగా జపాన్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 11 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులోకి రానుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ‘వాంటెడ్.. కార్తీ మన మనసులు దొచుకున్నాడు.. అలాగే దారిలోని కొన్ని నగలను ఎత్తుకెళ్లాడు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో కార్తీ దొంగ పాత్రలో కనిపించాడు.🌟🎥



bottom of page