ఐపీఎల్-2024 సీజన్‌ను ముం బై ఇం డియన్స్ పేలవంగా ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యా చ్‌ల్లోనూ ఓటమి పాలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అయితే ముం బై దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఏకం గా 277 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
ముం బై ఓటములకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఓ కారణంగా చెప్పవచ్చు . రోహిత్ శర్మ నుంచి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపించడం లో విఫలమవుతున్నాడు. పాండ్యా కెప్టెన్స్ పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. చాలా మం ది మాజీలు సైతం హార్దిక్‌పై విమర్శ ల వర్షం కురిపిస్తున్నారు. పాండ్యా ను వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ముంబై కెప్టెన్సీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హార్దిక్ పాండ్యా పట్ల ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అతడిని తమ జట్టు పగ్గాల నుంచి తప్పించే ఆలోచనలో ముంబై ఫ్రాంచైజీ ఉన్నట్టు వినికిడి. అతడి స్ధానం లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు వినిస్తున్నాయి. మరి రాబోయే మ్యా చ్‌ల్లోఏమి జరుగుతుందో వేచి చూడాలి.