top of page
Suresh D

ఆరో రోజు రూ. 600 కోట్లకు చేరువలో 'జవాన్​'..🎥🎞️

బాక్సాఫీస్ పై బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ దండయాత్ర కొనసాగుతుంది. అతడి దెబ్బకు రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. 'జవాన్' సినిమా విడుదలైన రోజు నుంచే థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది.

బాక్సాఫీస్ పై బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ దండయాత్ర కొనసాగుతుంది. అతడి దెబ్బకు రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. 'జవాన్' సినిమా విడుదలైన రోజు నుంచే థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఆరో రోజు కూడా జవాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆరో రోజు ఈ మూవీ అన్ని భాషలకు కలిపి రూ. 28.50 కోట్లు కలెక్ట్ చేసింది.తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత కూడా అదే రోజు కొనసాగిస్తుంది. మెుదటి రోజు రూ.75 కోట్లు, రెండో రోజు రూ.53.23 కోట్లు, మూడో రోజు రూ.77.83 కోట్లు, నాలుగో రోజు రూ.80.1 కోట్లు, ఐదో రోజు రూ. 32.92 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఈ క్రమంలో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.574.89 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ఆరు వందల కోట్ల వైపు దూసుకెళ్తోంది. 🎥🎞️


bottom of page