నేడు భారీ అంచనాలతో జవాన్ విడుదల అయింది . అపజయం ఎరగని అట్లీ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం ఇవన్నీ సినిమాపై అంచనాలు మరిన్ని పెంచాయి. ‘పఠాన్’ కంటే ఎక్కువ వసూళ్లను ‘జవాన్’ సాధిస్తుందని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. ?
‘జవాన్’ సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా ప్రారంభం అవుతుంది. ఒక సైన్యాన్ని కూడా ఎదుర్కోగల వ్యక్తి తన గతం మర్చిపోయి ఒక గ్రామంలో ఉండటం, 30 సంవత్సరాల తర్వాత మెట్రో ట్రైన్ హైజాక్... ఇలా ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించాడు దర్శకుడు అట్లీ. మొదటి అరగంట తర్వాత రివీల్ అయ్యే కీలకమైన ట్విస్ట్ షాక్ ఇస్తుంది. ప్రథమార్థం అంతా చాలా రేసీగా, ఫాస్ట్‌గా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే గూస్బంప్స్ ఇవ్వడం ఖాయం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది.
సెకండాఫ్‌లో విక్రమ్ రాథోడ్ ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా సాగుతుంది. షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి మొట్టమొదటిసారి ఒకరికి ఒకరు ఎదురు పడే ఇన్వెస్టిగేషన్ సీన్ ఎమోషనల్‌గా సాగుతుంది. కానీ ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చుట్టేసినట్లు అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ముగిశాక కథ చాలా వేగంగా సాగుతుంది. అక్కడ నుంచి రెండు యాక్షన్ బ్లాక్‌ల్లో సినిమా ఎండ్ చేసేస్తారు. ఒక బాలీవుడ్ స్టార్ క్యామియో, దాని తర్వాత వచ్చే ట్విస్ట్‌లకు కథలో స్పేస్ లేకపోయినా జొప్పించినట్లు అనిపిస్తుంది.షారుక్ ఖాన్ ఫ్యాన్స్‌కు ‘జవాన్’ గూస్బంప్స్ ఇస్తుంది. అందులో మాత్రం నో డౌట్. ఒక సౌత్ ఇండియన్ మాస్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్‌ను చూడటం అక్కడి ఆడియన్స్‌కు కచ్చితంగా కొత్తగా ఉంటుంది. నిజానికి ఈ సినిమాతో షారుక్ టార్గెట్ కూడా అదే. దానికి అట్లీ 100 శాతం న్యాయం చేశారు. సాంగ్స్ ప్లేస్మెంట్ కథకు అడ్డం పడతాయి. ఉదాహరణకు సెకండాఫ్‌లో షారుక్, దీపిక పదుకొనేల మధ్య ఒక పాట వస్తుంది. ఆ పాట ట్యూన్ అంతగా ఆకట్టుకోదు. అక్కడ అవసరం లేకపోయినా దీపికా పదుకోనే కోసం పెట్టినట్లు అనిపిస్తుంది.
కథలో కొన్ని పాయింట్లు కూడా చాలా సిల్లీగా అనిపిస్తాయి. కమర్షియల్ సినిమాలో లాజిక్స్ వెతక్కూడదు అంటారు కరెక్టే కానీ అవి మరీ పంటి కింద రాయిలా అడ్డం పడుతూ ఉంటాయి. సినిమాలో ఒక జైలు ఉంటుంది. కానీ అది జైలులా ఉండదు. అందులో ఖైదీలు ఉంటారు. కానీ వాళ్లు ఖైదీల్లా ఉండరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ భాషలో చెప్పాలంటే... ఒక మంచి జైలు, అందులో మంచి ఖైదీలు, అంతకంటే మంచి జైలర్ అన్నమాట.నయనతార పాత్రను రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ను బిడ్డకు తల్లిగా చూపించడం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. విలన్ పాత్రను కూడా చాలా బలంగా రాశారు. విజయ్ సేతుపతి వన్ లైనర్స్ అక్కడక్కడా నవ్విస్తాయి. సినిమాలో యాక్షన్ సీన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమాలో ఐదు ప్రధాన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. వీటన్నిటినీ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రీ-క్లైమ్యాక్స్‌లో వచ్చే ఛేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాస్ ఎలివేషన్లతో గూస్బంప్స్ తెప్పిస్తాయి. చిన్నపిల్లలకు అట్లీ సినిమాల్లో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో కూడా అది కనిపిస్తుంది. నయనతార కూతురు, షారుక్ ఖాన్ మధ్య ప్రథమార్థంలో వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి.
అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు సోసో గానే ఉన్నాయి. ‘చలోనా’ పాట పిక్చరైజేషన్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్బంప్స్ ఇస్తుంది. జీకే విష్ణు ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. కొన్ని కెమెరా మూమెంట్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉంటాయి.షారుక్ ఖాన్ ఫ్యాన్స్‌కు ‘జవాన్’ మస్ట్ వాచ్. ఈ స్థాయి కమర్షియల్ సినిమాలో షారుక్ ఈ మధ్యకాలంలో కనిపించలేదు. జనరల్ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. బాలీవుడ్‌కు మరో రూ.1000 కోట్ల గ్రాసర్ దాదాపు దొరికినట్లే.