top of page
MediaFx

‘జయహో రామానుజ’ మూవీ సాంగ్స్

లయన్‌ డా॥ సాయివెంకట్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్‌ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. రెండు భాగాలను తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం ఈ జూలై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ చిత్ర గీతాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయివెంకట్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. చక్కటి సాహిత్యం, సంగీతం కలబోతగా తీర్చిదిద్దాం. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో జీవించాలని, మహిళలను గౌరవించాలనే భగవత్‌ శ్రీరామానుజాచార్యుల వారి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్‌, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, నిర్మాత ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

bottom of page