తమిళ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఎదిగిన జయం రవి తెలుగువారికి సుపరిచితుడు. తెలుగులో కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రవి, తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. 2009లో టెలివిజన్ నిర్మాత కూతురు ఆర్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. 2018లో జయం రవి నటించిన "టిక్ టిక్ టిక్" సినిమాలో వీరి పెద్ద కుమారుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్తి తరచుగా తన భర్త, పిల్లలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తారు. కానీ, ఇటీవల ఆర్తి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ప్రముఖులు ముందుగా సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలు తొలగించి, ఆపై విడాకులు ప్రకటించడం కనిపిస్తుంది. అందుకే, ఆర్తి కూడా ఇలానే చేయబోతున్నారా అనే అనుమానం వస్తోంది. జయం రవి, ఆర్తి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అయితే, ఆర్తి ఈ ఫోటోలను తొలగించడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. దీంతో ఈ వదంతులు నిజం కాదని అభిమానులు అనుకుంటున్నారు. నిజనిజాలు తెలిసేందుకు జయం రవి లేదా ఆర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.