తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ 2014లో తెరకెక్కించిన ‘జిగర్తాండ’ మూవీ అప్పట్లో ఓ సంచలనం. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలో బాబీ సింహా నటన అందరినీ ఆకర్షించింది.
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ 2014లో తెరకెక్కించిన ‘జిగర్తాండ’ మూవీ అప్పట్లో ఓ సంచలనం. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలో బాబీ సింహా నటన అందరినీ ఆకర్షించింది. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని దక్కించుకున్నారు బాబీ సింహా. ఈ సినిమాను తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేశారు. హిందీలో సైతం ‘బచ్చన్ పాండే’గా ఈ సినిమా రీమేక్ అయ్యింది.అయితే, ఇప్పుడు ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ అంటూ మరోసారి సినీ ప్రేమికులను అలరించడానికి వస్తున్నారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ‘జిగర్తండ’ మాదిరి కాన్సెప్ట్‌తోనే వింటేజ్ యాక్షన్ డ్రామాను చూపించబోతున్నారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలు పోషించారు. రాఘవ లారెన్స్ గ్యాంగ్‌స్టర్ కాగా.. ఎస్.జె.సూర్య ఫిల్మ్ మేకర్. సోమవారం ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు.🎥🎞️