యంగ్ టైగర్ ఎన్టీఆర్-జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న "దేవర" షూటింగ్ శర వేగంగా సాగుతుంది. ఇటీవలే గోవాలో తారక్-సైఫ్ అలీఖాన్ లపై భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించారు. వర్షం పడుతున్నా ఆ యాక్షన్ సీన్ మరింత గొప్పగా వచ్చిందని యూనిట్ భావిస్తుంది.
తదుపరి షెడ్యూల్ థాయ్‌లాండ్‌లోని కాబ్రీ దీవుల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ తారక్-జాన్వీలపై రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా చిత్రీకరించనున్నారు. ఇద్దరూ థాయ్‌లాండ్ చేరుకున్నారని సమాచారం.
ఇప్పటి వరకూ యాక్షన్ సన్నివేశాలే హైలైట్ అయ్యాయి. అభిమానులు హీరో-హీరోయిన్ మధ్య ముద్దు సీన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఎంత వరకూ లిబర్టీ తీసుకుంటారో చూడాలి. పాన్ ఇండియా సినిమా కావడంతో నార్త్ ఆడియన్స్‌ని కూడా ఆకర్షించడానికి కొరటాల కొన్ని రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది.