top of page
MediaFx

“దేవర” ఫస్ట్ సింగిల్ పై నెలకొన్న క్రేజ్.!



పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ హంగులుతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంగీతం అనిరుద్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ తన మ్యూజిక్ పై భారీ హైప్ నెలకొనగా ఇప్పుడు మే నెలలోకి అడుగు పెట్టడంతోనే తారక్ ఫ్యాన్స్ లో ఈ సినిమా మొదటి సాంగ్ పై ఆసక్తి నెలకొంది.

దీనితో ఇప్పుడు దేవర ఫస్ట్ సింగిల్ అంటూ ఆ హాష్ ట్యాగ్ డైలీ ట్రెండ్ అవుతుంది. వీటితో దేవర సాంగ్ కోసం వారు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సాంగ్ తారక్ బర్త్ డే రోజు వస్తుంది అని వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

bottom of page