ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ సైలెంట్‌గా దుబాయ్‌కి వెళ్తుండటంపై నెట్టింట్లో భిన్న రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దుబాయ్‌కి పయనం అయ్యాడు. సైమా అవార్డుల వేడుకలకు ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ బయల్దేరాడు. రెండు తెలుగు రాష్ట్రల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ సైలెంట్‌గా దుబాయ్‌కి వెళ్తుండటంపై నెట్టింట్లో భిన్న రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్ ఇలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద స్పందించడం కానీ ఖండించడం కానీ చేయకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు.కావాలనే ఎన్టీఆర్ మౌనం వహిస్తున్నాడని, రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా సైలెంట్ అయ్యాడని యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంటున్నారు. టీడీపీకి భవిష్యత్తు ఎన్టీఆర్ అని ఓ వర్గం అంటుంది. ఇలా నెట్టింట్లో ఎన్ని రకాలుగా ప్రచారాలు జరుగుతున్నా, విమర్శలు వస్తున్నా కూడా వాటిని ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదనిపిస్తోంది.🎥🎞️