హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) నివాళులర్పించారు. తెల్లవారు జామున ఘాట్ వద్దకు చేరుకొని అంజలి ఘటించారు. మరోవైపు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి (NTR Vardhanthi) సందర్భంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎన్టీఆర్ (NTR) విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నేతలు పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ (Balakrishna), రామకృష్ణతో పాటు వారి కుటుంబ సభ్యులు సుహాసిని, పలువురు పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్టీఆర్ తన పాలనతో బాసటగా నిలిచారని అన్నారు.