ఒక్క 5 నిమిషాలుఈ ఆసనం వేస్తే.. గుట్టలాంటి పొట్టైనా కరగాల్సిందే..
- MediaFx
- Aug 29, 2024
- 1 min read
కేవలం ఐదు నిమిషాల్లో ఇప్పుడు చెప్పే ఆసనం వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం కూడా యోగాలో ఒక భాగమే. ఈ ఆసనం వేయడం కూడా చాలా సింపుల్. పైన చిత్రంలో చూపించినట్లుగా గోడకు కాళ్లను పెట్టాలి. చేతులను పక్కకు పెట్టాలి. మరి ఈ ఆసనం ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం.
పొట్ట కరిగిపోతుంది:
ప్రతి రోజూ విపరీత కరణి ఆసనం వేయడం వల్ల పొట్ట అనేది ఈజీగా కరిగిపోతుంది. ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడేవారు రోజూ ఈ ఆసనం వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆసనం వేస్తే పొట్ట దగ్గర కండరాలపై ఒత్తిడి కొవ్వు అనేది కరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. రక్త సరఫరా సక్రమంగా:
విపరీత కరణి ఆసనం వేయడం వల్ల శరీరం అంతా రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగడం వల్ల చాలా సమస్యలు కంట్రోల్ అవుతాయి. అంతే కాకుండా రక్తం కూడా శుద్ధి అవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది:
కేవలం 5 నిమిషాలు ఈ ఆసనం వేస్తే.. జీర్ణ వ్యవస్థ అనేది మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
నిద్ర చక్కగా పడుతుంది:
ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి.. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజూ ఈ ఆసనం వేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ప్రతిరోజూ ఉత్సాహంగా ఉంటారు. అలసట, బద్ధకం తగ్గుతాయి.