top of page
Suresh D

భర్త పై ఆసక్తికర కామెంట్స్ చేసిన జ్యోతిక..🎥✨

చాలా గ్యాప్ తర్వాత వయత్తినీలే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. కెరీర్ తొలినాళ్లలో కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

తమిళంలోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలు చేస్తుంది జ్యోతిక. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలను ఎంచుకుంటున్న జ్యోతిక తన సినిమాల్లో మాత్రం హీరోస్ అవసరం లేదంటోంది. తాను సినిమాలు చేయాలంటే హీరోల సపోర్ట్ అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల సైతాన్ సినిమాతో మరోసారి వెండితెరపై మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ తన భర్త సూర్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.

జ్యోతిక మాట్లాడుతూ.. “తమిళంలో ఫలానా నటుడితో నటించాలనే కోరిక నాకు లేదు. సూర్యలో నాకు చాలా ఇష్టమైనది ఆయన నాకు ఇచ్చే గౌరవం. నాకోసం కేటాయించే సమయం. నేను భార్యగా.. స్త్రీగా, తల్లిగా గౌరవించబడినందుకు చాలా గర్వపడుతున్నాను. సూర్యకు సహనం ఎక్కువ. నన్ను చాలా భరిస్తున్నాడు. సూర్య ఎక్కువగా ప్రతి విషయాన్ని వింటుంటాడు. కానీ నేను మాట్లాడం ప్రారంభిస్తే అస్సలు ఆగను. నిజంగా నన్ను తట్టుకోవడం చాలా కష్టం. ” అంటూ చెప్పుకొచ్చింది.

తన భర్త సూర్యతో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశం వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం సైతాన్ సినిమా ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా ఉంది జ్యోతిక. చాలా రోజులుగా తన భర్త సూర్యతో కలిసి ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హిందీలో మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది.🎥✨

bottom of page