top of page
MediaFx

ఆ విషయంలో కాజల్‏కు సలహా ఇచ్చిన బన్నీ..

టాలీవుడ్ చందమామ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసేందుకు ముందుంటుంది. ఓవైపు మదర్‎గా హ్యాప్పీ లైఫ్ గడుపుతున్న కాజల్.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మళ్లీ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తుంది. ప్రస్తుతం కాజల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది కాజల్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న కాజల్ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ క్రమంలో స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన సినీ ప్రయాణంలో బన్నీ ఒక విలువైన సలహా ఇచ్చాడని తెలిపింది. ఇప్పటికీ దాన్నే పాటిస్తున్నానని చెప్పుకొచ్చింది. కెమెరా ఆఫ్ చేశాక కూడా కొద్దిసేపు అదే ఎమోషన్ కంటిన్యూ చేయాలని.. ఎడిటింగ్ సమయంలో అది చాలా ఉపయోగపడుతుందని చెప్పాడని… ఆ సలహా తనకు చాలా ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వీరిద్దరి కాంబోలో ఆర్య 2 వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది. ఆర్య 2 తర్వాత ఇద్దరు కలిసి ఎవడు సినిమాలో మెరిశారు.

కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్. వీరికి నీల్ కిచ్లూ అనే బాబు ఉన్నాడు. పెళ్లి, పిల్లలు అంటూ కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది. తెలుగులో భగవంత్ కేసరి సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ 2, సత్యభామ సినిమాలతో అడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.



bottom of page