కాజల్ అగర్వాల్ ప్రస్తుతం 'సత్యభామ' ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. మ్యారేజ్ తరువాత ఆమె 'భగవంత్ కేసరి'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఆ సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీగా మాత్రమే నిలిచింది. ఇక ఇప్పుడు 'సత్యభామ'తో కాజల్ మోస్ట్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది.
కాజల్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'సత్యభామ' గురించి తన ఆనందాన్ని పంచుకుంది. ఇది తన కెరీర్‌లో కొత్త ప్రయత్నం అని, ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పింది. ఈ కథ వినగానే నచ్చిందని, చాలా కొత్తగా అనిపించిందని చెప్పింది. అందుకే సినిమా చేసేందుకు వెంటనే ముందుకొచ్చానని తెలిపింది.
ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనే ఆఫర్స్ చాలా వచ్చాయన్న కాజల్, కాని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే ఒప్పుకోవాలని, అందుకే వాటిని రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తే ప్రెజర్‌లా కాకుండా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని అనుకున్నానని వెల్లడించింది. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయని, ఫస్ట్ టైమ్ యాక్షన్, భారీ స్టంట్స్ చేశానని చెప్పింది.
'సత్యభామ' తనకు సెకండ్ ఇన్నింగ్స్ కాదని, ఈ మూవీతో తన కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకున్నానని తెలిపింది. యాక్టింగ్ అంటే ప్యాషన్ అని, అందుకే పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. ఈ సినిమాలోనూ తన కారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందని తెలిపింది. మేకింగ్ టైంలో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్‌ను కలిసినప్పుడు క్రిమినల్స్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారని, ఆ అంశాలను కథలో భాగం చేశామని తెలిపింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ మూవీతో ఆ కల నెరవేరిందని తెలిపింది.