top of page
MediaFx

కల్కి దుమ్మురేపే రికార్డ్స్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడే..

నార్త్ అమెరికాలో నాన్ స్టాప్ రికార్డులు కొల్లగొడుతుంది కల్కి. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సెన్సేషనల్ సినిమాకు ఓవర్సీస్‌లో ఇప్పటికే 11 మిలియన్లకు పైగా వచ్చాయి. తాజాగా మరో రికార్డు కూడా అందుకుంది కల్కి. వరసగా 5 రోజులు నార్త్ అమెరికాలో 1 మిలియన్ కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది కల్కి.

ఈ మధ్యే హరోం హరతో వచ్చిన సుధీర్ బాబు.. త్వరలోనే పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన స్టోరీ లైన్‌తో.. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమా రాబోతుంది. రుస్తుం, టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ, ప్యాడ్‌, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేర్నా అరోరా ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారతీయుడు 2 నుంచి కాలెండర్ సాంగ్ విడుదలైంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటను పూర్తిగా గ్లామర్ కోణంలోనే చిత్రీకరించారు శంకర్. ఐ సినిమాలో కాలెండర్ సాంగ్ గుర్తుకొస్తుంది ఈ పాటను చూస్తుంటే..! ఈ పాటలో 2017 మిస్ యూనివర్స్ డెమీ లీ టెబో నటించారు.

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలోని మేజర్ షెడ్యూల్‌ను శ్రీలంకలోని కొన్ని సిటీస్‌లో ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కానీ ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై పూటకో మాట మాట్లాడుతున్నారు శంకర్. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారీయన. భారతీయుడు 2 విడుదలైన ఆర్నెళ్ళ తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉంటుందని తెలిపారు. ఈ లెక్కన 2024లో గేమ్ ఛేంజర్ రానట్లే అని తేలిపోయింది.

bottom of page