కల్కి 2898 ఏడీ ప్రమోషన్‍కు మూవీ టీమ్ మరో వెరైటీ ప్లాన్ అమలు చేస్తోంది. ఎంతో పాపులర్ అయిన బ్యాటిల్ రొయాల్ గేమ్ క్రాఫ్టాన్ ‘బ్యాటిల్‍గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)’తో చేతులు కలిపింది. కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి విపరీతమైన క్రేజ్ ఉంది. దీన్ని మరింత పెంచేలా బీజీఎంను గేమింగ్ పార్ట్‌నర్‌గా మూవీ టీమ్ ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన బీజీఎంఐ x కల్కి 2898 ఏడీ ట్రైలర్ నేడు (జూన్ 24) వచ్చింది.
బీజీఎంఐలో కల్కి క్యారెక్టర్లు
బీజీఎంలో కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. “రికార్డులు చెక్ చేసుకో.. నేను ఇప్పటి వరకు ఒక్క రికార్డు కూడా ఓడిపోలేదు” అని ప్రభాస్ చెప్పే డైలాగ్‍తో ఈ ట్రైలర్ మొదలైంది. కల్కి సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ క్యారెక్టర్ జీబీఎం గేమ్‍లో ఉండనుందని ఈ ట్రైలర్లో ఉంది. అలాగే, ఈ చిత్రంలో ఉండే చాలా పాత్రలు కూడా బీజీఎంఐలోకి వచ్చే ఇన్-గేమ్ ఈవెంట్‍లో ఉండనున్నాయి. కల్కి ప్రపంచం కూడా కనిపించనుంది. బీజీఎంఐ గేమ్‍లో కల్కి 2898 ఏడీకి సంబంధించిన ఇన్-గేమ్ ఈవెంట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. యాక్షన్, అడ్వెంచర్, స్టోరీ టెల్లింగ్‍తో బీజీఎంఐలో ఈ కల్కి గేమ్ ఈవెంట్ ఉంటుదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ గేమ్ ఆడిన వారికి రివార్డ్స్, చాలెంజెస్ లభించనున్నాయి. బీజీఎంఐలో కల్కి స్టోరీతో ఆ ప్రపంచంలో గేమ్ ఆడే ఛాన్స్ త్వరలోనే రానుంది.