top of page
MediaFx

అప్పుడే అక్కడ వన్ మిలియన్ క్లబ్ లోకి “కల్కి”

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి (Kalki 2898AD) జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూన్ 26 న నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోలతో ప్రారంభం కానుంది.నార్త్ అమెరికా లో ప్రీ సేల్స్ తో 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం సంచలనంగా మారింది. సినిమా డే 1 భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయం అని అంచనా. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. విజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

bottom of page