top of page
MediaFx

కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. అటు ప్రమోషన్లతో మరింత క్యూరియాసిటిని కలిగిస్తున్నారు మేకర్స్. మన పురణాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్కి ప్రాజెక్ట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోతోపాటు మరో ఎనిమిది రోజులు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం కల్కి మేకర్లకు శుభవార్త అందించింది. కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 75 రూపాయాలు.. మల్టీప్లెక్స్ లో టికెట్ పై 125 రూపాయాలు పెంచేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు 5 షోలు వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. విడుదలకు మరో రెండు రోజులు మాత్రం టైమ్ ఉండడంతో ప్రమోషన్స్ ముమ్మరం చేసింది కల్కి టీం. అటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి స్టోరీ రివీల్ చేస్తూ వీడియోస్ షేర్ చేస్తున్నారు. మరోవైపు థీమ్ ఆఫ్ కల్కి పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది కల్కి టీం. ఇందులో నటి శోభనతోపాటు పలువురు నాట్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ షేర్ చేసింది. అమితాబ్, దీపికా, దిశా పాటనీ, కమల్ హాసన్, శోభన కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

bottom of page