top of page
MediaFx

విడుదలకు ముందే ‘కల్కి’ రికార్డ్..🌟💸


ప్రభాస్ కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఇలా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉంటే.. సినిమా ప్రమోషన్స్‌ను పీక్స్‌లో చేస్తూ ఆడియెన్స్‌లో మరింత బజ్‌ను, హైప్‌ను క్రియేట్ చేయాలి. ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, వీడియోలు, ఈవెంట్లు నిర్వహిస్తూ ఉండాలి. కానీ కల్కి టీం సైలెంట్‌గా ఉంటోంది. భైరవ ఆంథమ్ అంటూ ఫస్ట్ సింగిల్ మీద హంగామా చేశారు. చెప్పిన టైంకు విడుదల చేయకుండా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఇలా ప్రమోషన్స్, అప్డేట్లు సరిగ్గా చేయక కల్కి మీద నిరాసక్తి కలిగేలా చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే పర్వాలేదనిపించేలానే ఉంది. బుజ్జి భైరవ అంటూ వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్‌లో బాగానే ఆకట్టుకుంది.

బుజ్జి కారుతోనే ఇప్పటి వరకు ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. చెన్నై, ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో బుజ్జిని రైడ్ చేస్తూ అక్కడి జనాల్ని ఆకర్షిస్తున్నారు. అయితే కల్కి 2898 ఏడీ ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది. ప్రీ సేల్స్‌తోనే రెండు మిలియన్ల డాలర్లను నార్త్ అమెరికాలో కొల్లగొట్టేసింది. లాంగ్ రన్‌లో కనీసం మిలియన్ డాలర్‌లను కూడా కొల్లగొట్టడానికి కిందా మీదా పడుతుంటాయి. కానీ కల్కి మాత్రం ప్రీ సేల్స్‌తోనే రెండు మిలియన్లను రాబట్టేసింది. కల్కి ఇలా ప్రీ సేల్స్‌తోనే ఒక్క నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ల డాలర్లు కొల్లగొడితే.. అది కూడా విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు ఉంటే.. ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఊహించడానికి భయంకరంగా ఉందని అభిమానులు అంటున్నారు. డే వన్ రికార్డులు కచ్చితంగా బద్దలవుతాయని చెబుతున్నారు. ఆదిపురుష్, సలార్ సినిమాలే 130, 150 కోట్ల వరకు ఓపెనింగ్స్ సాధించాయి.

ఈ లెక్కన కల్కి 2898 ఏడీకి రెండు వందల కోట్ల వరకు ఓపెనింగ్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ ఇలా భారీ క్యాస్టింగ్‌తో అశ్వనీదత్ ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మించాడు. ఐదు వందల కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్టుగా సమాచారం. రెండు వేల కోట్లు కొల్లగొట్టాలనే టార్గెట్‌తో దిగుతున్న కల్కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Related Posts

See All

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథులు వీళ్లే.. రంగంలోకి బడా హీరోస్.. ఇక రచ్చే..

ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అటు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇటు చిత్రయూనిట్ కల్కి ప్రమోషన్లలతో బిజీగా ఉండగా..

bottom of page