top of page
MediaFx

🌟 'కల్కి 2898 AD' ట్రైలర్ ను మూడు సార్లు చూసిన సందీప్ రెడ్డి వంగా 🚀

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ చిత్రం 'కల్కి 2898 AD' ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం జూన్ 27, 2024 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'ప్రాజెక్ట్ కె' గా మొదలైనప్పటి నుండి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ట్రైలర్ చూసి సోషల్ మీడియా వేదికగా సూపర్ కామెంట్స్ చేసారు. "సూపర్ ట్రైలర్, మూడు సార్లు చూసాను. ఇది కచ్చితంగా డిఫెరెంట్ వరల్డ్ మరియు కొత్త అనుభవం. ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా" అని అన్నారు.ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


bottom of page