🎬 పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే మరియు దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటించిన, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి”కి సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటికే రెండు విడుదలయ్యాయి.
📽️ రీసెంట్ గా ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ వేసినపుడు ఒక ట్రైలర్ లీక్ అయ్యి తర్వాత అధికారికంగా రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ ట్రైలర్ కి ముందే లీక్ అయిన మరో ట్రైలర్ ఇంకా దాచినట్టు గమనార్హం.
🤔 చాలా మంది ఆ ట్రైలర్ వదులుతారని భావించారు, కానీ నాగ్ అశ్విన్ ఇంకొకటి వదిలాడు. థియేటర్ లోనే ఎక్కువ సర్ప్రైజ్ లతో ప్రేక్షకులను థ్రిల్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఈ గ్యాప్ లో మరిన్ని అప్డేట్స్ వస్తాయేమో చూడాలి.