top of page
MediaFx

‘కల్కి 2898 AD’లో నా పాత్ర అదే – ప్రభాస్

గత కొన్ని రోజులుగా, కల్కి 2898 AD’ సినిమా ప్రమోషన్లలో ఈ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ కబుర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రానికి గ్రౌండ్ లెవల్‌లో భారీగా హైప్ లేదని కొందరు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ, అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ అయిన దగ్గర నుంచి.. ఆ ప్రచారం పూర్తిగా తప్పు అని రుజువు అయిపోయింది. ప్రభాస్ ‘కల్కి’ టిక్కెట్లు దక్కించుకోవడానికి ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు చిత్రబృందం కూడా సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి టీమ్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రభాస్ మాట్లాడుతూ.. “కల్కి సినిమాలో నా పాత్ర చాలా గ్రే షేడ్స్‌తో ఉంటుంది. అలాగే, నేను సూపర్‌ హీరోగా కనిపిస్తాను, దానికి హ్యూమర్ టచ్ కూడా ఉంటుంది. కాకపోతే, తెలుగు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు ఈ పాత్రలో నన్ను చూడటం కొత్తగా అనిపిస్తోంది. పైగా గ్రే షేడ్స్‌తో కూడిన ఫన్నీ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. కాగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



bottom of page