top of page
Suresh D

థియేటర్స్ కంటే ముందే ఓటీటీలో “కల్కి” రిలీజ్..?🎥✨


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ సహా దీపికా పదుకొన్ మరియు దిశా పటాని లు హీరోయిన్స్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” దీని కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మరి ఈ చిత్రం రిలీజ్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొనగా దీనికి ముందే ఓటీటీ రిలీజ్  అంటూ ఓ క్రేజీ న్యూస్ మరింత ఆసక్తి రేపింది.అయితే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే దర్శకుడు నాగ్ అశ్విన్ థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఇది వరకు ఒక కామికల్ వెర్షన్ లో సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేవి కొంతమేర రివీల్ చేసాడు. అయితే ఈసారి సినిమా మెయిన్ కాన్సెప్ట్ తో ఓటీటీ వెర్షన్ కోసం ఒక స్పెషల్ యానిమేటెడ్ వెర్షన్ ని రెడి చేస్తున్నాడని తెలుస్తుంది. దీనితో సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ కి తెలుస్తుంది అని అలాగే ఈ వెర్షన్ కి కూడా ఓటీటీ డీల్ జరిగినట్లు వినిపిస్తోంది. ఇక ఈ వెర్షన్ కి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రంకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.🎥✨

bottom of page