తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ సినిమా అభిమానులు ఎదురుచూస్తున్న కల్కి సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ విజువల్ ట్రీట్ ఎప్పుడు చూసేద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచింది.
కల్కి టీమ్ ప్రత్యేక వాహనాలతో దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో సినిమా ప్రమోట్ చేస్తోంది. వాహనాలకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి ఈ వివరాలను ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కార్డులు
కల్కి సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. అమెరికా ప్రీమియర్ టికెట్స్ ప్రీ సేల్ బిజినెస్‌లో కల్కి దుమ్మురేపుతోంది. మిలియన్ డాలర్ మార్క్ దాటేసి, ట్రిపులార్ సినిమా రికార్డును అధిగమించింది. జూన్ 26న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు.
నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రంలో అమితాబ్, కమల్‌హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.