top of page
Suresh D

మొత్తానికి.. ఇండియ‌న్‌2కు ముగింపు ప‌లికారు🎥🎞️

ద‌ర్శ‌కుడు శంక‌ర్, లోక నాయ‌కుడు క‌మ‌ల్ హ‌స‌న్ క‌ల‌యిక‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఇండియ‌న్ 2 ఎట్ట‌కేల‌కు పూర్త‌యింది. భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్‌గా 2015లో ప్రారంభ‌మైన ఈ సినిమా అనేక డ‌క్కామొక్కీలు తిని 2024 జ‌న‌వ‌రి1తో షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పారు.🎥🎞️

ద‌ర్శ‌కుడు శంక‌ర్ , లోక నాయ‌కుడు క‌మ‌ల్ హ‌స‌న్ క‌ల‌యిక‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఇండియ‌న్ 2  ఎట్ట‌కేల‌కు పూర్త‌యింది. అస‌లు సినిమా వ‌స్తుందా రాదా, మొత్తానికే ఆగిపోయిందాఅనే రూమ‌ర్స్‌ను కొట్టిపారేస్తూ సినిమాను పూర్తి చేశారు. 25 సంవ‌త్స‌రాల క్రితం 1996లో శంక‌ర్  ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హ‌స‌న్ హీరోగా వ‌చ్చిన భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్‌గా 2015లో ప్రారంభ‌మైన ఈ సినిమా అనేక డ‌క్కామొక్కీలు తిని 2024 జ‌న‌వ‌రి1తో షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పారు.

అయితే ఈ రోజుతో చిత్రం షూటింగ్ అయిపోయింద‌ని అధికారికంగా సోష‌ల్‌ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ‌డంతో ఇక అంద‌రి చూపు ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్  తో శంక‌ర్  చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమాపై ప‌డింది. ఈ సినిమాను కూడా త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, అప్డేట్లు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఇండియ‌న్ 2 గ్లిమ్స్ సినిమా పై అంచ‌నాలు పెంచేయ‌డంతో అభిమానులు చాలామంది ఆ సినిమా రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

ఏ ముహుర్తానా ఈ ఇండియ‌న్ 2  సినిమాను మొద‌లుపెట్టారో గానీ అప్ప‌టి నుంచి ఓ అడుగు ముందుకేస్తే రెండ‌డుగులు వెన‌క్కి అన్న చందంగా ప‌రిస్థితి త‌యారైంది. అంత‌కంత‌కు బ‌డ్డెట్ పెరిగిపోవ‌డం, షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగి మ‌నిషి చ‌నిపోవ‌డం, నిర్మాతలు చేతులు మార‌డం ఇలా ప్ర‌తి సారి ఏదో ఓ స‌మ‌స్య వ‌చ్చి సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు త‌మిళ‌నాడు సీఎం కుమారుడు హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ ప్రోడ‌క్ష‌న్ రెడ్ గేయింట్‌, త‌మిళ బ‌డా నిర్మాణ సంస్థ‌ లైకా టేకోవ‌ర్ చేసుకుని చిత్ర నిర్మాణం ప్రారంభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సినిమాలో సిద్ధార్థ్, బ్ర‌హ్మానందం, బాబీ సింహా, ఎస్జే సూర్య, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలాఉండ‌గా ఇప్పుడు ఈ ఇండియ‌న్‌2 సినిమా స‌మ‌యంలోనే ఇండియ‌న్‌3  షూటింగ్ పూర్తి చేశార‌ని తెలుస్తోంది. ఇండియ‌న్ 2 సినిమాను వేస‌విలో, గేమ్ ఛేంజ‌ర్ సినిమాను సెప్టెంబ‌ర్‌లో, ఇండియ‌న్‌3 ని దీపావకి విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.🎥🎞️

bottom of page