top of page
MediaFx

కన్నప్ప టీజర్‌ మొత్తానికి అదే హైలెట్..పిచ్చెక్కిపోతున్నా ఫ్యాన్స్..


మంచు విష్ణు "కన్నప్ప" టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తోంది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. టీజర్ మొత్తం ఎలా ఉన్నది పట్టించుకోకుండా, ప్రభాస్ ఐ షాట్ కోసం తెగ సంబరపడుతున్నారు. ట్విట్టర్ మొత్తం ప్రభాస్ ఐ షాట్ ట్రెండ్ అవుతోంది. కన్నప్ప టీజర్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

ఈ టీజర్‌లో కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి పెద్ద నటులను చూపించారు. టీజర్ విజువల్ ట్రీట్‌గా ఉంటుందని స్పష్టంగా అనిపిస్తోంది. కొన్ని షాట్స్ హైలెట్‌గా ఉన్నాయి. కానీ, కన్నప్పలో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు ఎందుకని అందరూ అనుకుంటున్నారు.

మంచు విష్ణు తన వర్షన్ కధ అని, "కన్నప్ప వరల్డ్" అని చెబుతూ వైరల్ అవుతున్నారు. ఇకపై ప్రతి సోమవారం "కన్నప్ప సోమవారం"గా నిలుస్తుందని, కొత్త అప్డేట్లు ఇస్తామని తెలిపారు.

కన్నప్ప మైథాలజీ కాదని, ఇది మన చరిత్ర అని శరత్ కుమార్ ఈ ఈవెంట్‌లో చెప్పారు. శివుడు పర్మిషన్ ఇచ్చారని, ఆయన ఆజ్ఞతోనే సినిమాను తీసుకొచ్చామని మోహన్ బాబు, విష్ణు తెలిపారు.



bottom of page