top of page
MediaFx

లైఫ్​లో మ‌న‌కంటూ ఒక పార్ట్​నర్ ఉండాలి : కంగనా ర‌నౌత్


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ర‌నౌత్ త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కంగనా రనౌత్‌ (Kangana Ranaut) స్వీయ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం గ‌తేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండ‌గా.. అనుకోని కార‌ణాల వ‌ల‌న విడుద‌ల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్‌ వద్దకు వెళ్లలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు కంగ‌నా ప్రకటించారు. ఇక విడుద‌ల‌కు ఇంకా నాలుగు రోజులే ఉండ‌డంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోటుంది కంగనా. అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. త‌న‌పై వ‌స్తున్న నెగిటివ్ పబ్లిసిటీ కారణంగానే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నట్లు కంగ‌నా చెప్పారు. అయితే ఎవ‌రిని చేసుకుంటారు రాజ‌కీయ నాయ‌కుడినా.. లేదా న‌టుడినా అన్న ప్ర‌శ్న‌కు రిప్ల‌య్ ఇస్తూ.. ఎవ‌రిని చేసుకోవాలి అని ఏం లేదు. మ‌న‌సుకు న‌చ్చిన వాడై ఉండాలి. అలాగే పెళ్లిపై కూడా ఎలాంటి ద్వేషం లేదని.. మ‌న‌కంటూ లైఫ్‌లో ఒక పార్ట్​నర్ ఉండాలని తెలిపారు. అయితే నేను పెళ్లి చేసుకుందాం అంటే నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అందుకే వివాహం చేసుకోలేకపోతున్నా. కోర్టులో కూడా నాపై కేసులు ఉన్నాయి. పెళ్లి అయిన అనంత‌రం కోర్టు కేసు అంటూ పోలీసులు ఇంటికి వ‌స్తే మా అత్తమామలు భ‌య‌ప‌డి పారిపోతారు అంటూ కంగ‌నా చెప్పుకోచ్చింది.

bottom of page