🎬 ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కు చెందిన మహిళా సిబ్బంది కుల్విందర్ కౌర్ కంగనాను చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటన సంచలనంగా మారింది. సీఐఎస్ఎఫ్ కుల్విందర్ కౌర్ పై సస్పెన్షన్ విధించి, కేసు నమోదు చేసింది.
అయితే, కుల్విందర్ కౌర్ కు మద్దతుగా ఉన్నవారిపై కంగనా ట్విట్టర్ వేదికగా ఘాటు స్పందించారు. “అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకేం ఫర్వాలేదా?” అంటూ ఆమె ప్రశ్నించారు.
“నేరం చేసిన వారు ఎమోషనల్, మానసిక లేదా ఆర్థిక కారణాలు చెబుతుంటారు. కానీ, నేరానికి శిక్ష తప్పదు. ఇలాంటివి సమర్థిస్తే, అత్యాచారాలు, హత్యలు కూడా ఫర్వాలేదా? మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ధ్యానం, యోగా చేయండి. చెత్త, ద్వేషం, అసూయల నుంచి విముక్తి పొందండి” అంటూ కంగనా సుదీర్ఘ పోస్టు పెట్టారు.
ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కుల్విందర్ కౌర్ ను సీఐఎస్ఎఫ్ తొలగిస్తే, ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని గాయకుడు విశాల్ దద్లానీ చెప్పాడు. కంగనా దIndirect గా అతనికి సమాధానమిచ్చారు.