top of page
MediaFx

కంగువ ఫస్ట్ సాంగ్ దుమ్మురేపిందిగా..!!


సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ స్టూడియో అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తూ ఫైర్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాట విడుదలైన వెంటనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.  పవర్ ఫుల్ బీట్స్ అలాగే ఆకట్టుకునే విజువల్స్ పాటకు హైలైట్ అనే చెప్పాలి.  ఈ సాంగ్ పై సూర్య అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. 2.5 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది అని రాసుకొచ్చారు కొందరు.

ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుంది, దేవీ శ్రీని ప్రశంసిస్తూ ఓ అభిమాని ఇలా ట్వీట్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్‌ ఇరగదీశాడు అని రాసుకొచ్చారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే, చాలా కాలంగా దాని యుద్ధ సన్నివేశం గురించి చర్చ జరిగింది. కంగువ అక్టోబర్ 10, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ  సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

bottom of page