కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా..
బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ కీ రోల్లో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతిఅప్డేట్ ఆకట్టుకోగా.. రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే..రెండు ట్రైబల్ లీడర్స్ మధ్య జరిగే అధికార పోరుగా ఈ సినిమా సాగుతుందని నిన్నటి నుంచి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 1678లో అత్యంత క్రూరమైన వారియర్గా సూర్య కనిపించనున్నాడట. ఈ క్రమంలోనే ఒక మిషన్ కోసం లేడీ శాస్త్రవేత్త సహాయం తీసుకుని భూమి మీదకు వస్తాడట. అక్కడ తను మార్పు చెంది.. తర్వాత తిరిగి తన లోకానికి వెళ్లి ఆ మిషన్ ను ఎలా కంప్లీట్ చేస్తాడు అనేది 'కంగువ' మూవీ కథని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.ఇక కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 'బింబిసార' లో కూడా.. ఓ క్రూరమైన రాజు భూమి వీదకు వచ్చి పరివర్తన చెంది.. పైకి వెళ్తాడు. ఇప్పుడు 'కంగువ' కూడా ఇదే కథ లైన్ ఉందని టాక్ రావడంతో.. కొంపతీసి ఈ మూవీ బిబిసారకు రీమేక్ గా తీయడం లేదుగా అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట ఇదే హాట్ టాపిక్గా మారింది. కాగా.. ఈ మూవీ సమ్మర్ స్పెషల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.