top of page
MediaFx

కన్న తండ్రిగా బాధ ఉంది..కవిత అరెస్ట్‌పై కేసీఆర్ ఎమోషనల్


దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. గులాబీ బాస్ కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయి తీహార్ జైలులో జ్యుడీషియల్‌ ఖైదీగా దాదాపు 4 నెలలు గడుస్తోంది. కాగా.. ఈ విషయంపై గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పందించగా.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో కవిత అరెస్టుపై స్పందించారు. రాజకీయ కక్షతోనే తన కూమార్తెను జైలులో పెట్టారని కేసీఆర్ ఆరోపించారు. కూతురు జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం తాను సలసల మరిగిపోయే అగ్ని పర్వతంలా ఉన్నానని కేసీఆర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

అయితే.. జైలులో ఉన్న కవిత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న కవిత.. లోబీపీ కారణంగా ఆమె కళ్లు తిరిగి పడిపోగా.. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే.. కవిత జైలులో నాలుగు నెలలుగా ఉంటుండగా.. ఆమె 10 కిలోల వరకు బరువు తగ్గినట్టు సమాచారం. ఈ క్రమంలో.. కేసీఆర్ కూతురి విషయంలో కాస్త భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేదా అని కేసీఆర్ వివరించారు. అధికారంలో కంటే అపొజిషన్‌లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఎక్కడో ఉన్న వారిని చేరదీసి మంచి నేతలను చేసి పదవులు ఇస్తే.. వాళ్లు మాత్రం పదవులు అనుభవించి పార్టీ వీడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. కేసీఆర్ తేల్చి చెప్పారు.

bottom of page