కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అస్వస్థత!
- Suresh D
- Apr 2, 2024
- 1 min read
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం (ఏప్రిల్ 1)బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
అయితే శివరాజ్ కుమార్ ఎందుకు ఆస్పత్రిలో చేరారో ఇంకా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఆయనను చూసేందుకు మధు బంగారప్ప ఆస్పత్రికి వెళ్ళారు. దీంతో శివన్న ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం శివరాజ్ కుమార్ కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది. కేవలం జనరల్ చకప్ కోసమే ఆయన ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. ఈరోజు శివన్న డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా శివరాజ్‌కుమార్ చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమా పనులు. మరొకటి లోక్‌సభ ఎన్నికల ప్రచారం. శివరాజ్‌కుమార్ భార్య గీత ఈసారి షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అందుకే తన భార్య తరపున ప్రచారం చేసేందుకు పలు పట్టణాల్లో పర్యటిస్తున్నాడు శివన్న. 🏨