top of page
Shiva YT

🎥 అంచనాలు మించిపోతున్న ‘కాంతారా-2 🎬

కాంతార 2 సినిమా ఎందుకు అంత ఆలస్యమవుతుంది..? షూటింగ్ లేట్ అవుతుందా..? లేదంటే కథ పరంగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? బడ్జెట్ అదుపు తప్పుతున్నా కూడా నిర్మాతలు అంత నిశ్చింతగా ఉండటానికి కారణమేంటి..? ఏ లెక్కన సీక్వెల్ కోసం ఇంతగా ఖర్చు పెడుతున్నారు..? అసలు కాంతార 2 వచ్చేదెప్పుడు..? 2024లో కూడా రాదా..?

జైలర్‌లో ఓ డైలాగ్ ఉంటుంది.. వర్త్ వర్మ వర్త్ అని..! ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నపుడు అది వర్త్ అనిపిస్తే.. ఎదురు చూపులన్నీ మరిచిపోతుంటారు. ఇప్పుడు కాంతార 2 విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. గతేడాది విడుదలైన కాంతార దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం.. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం.

కర్ణాటకలోని భూత కోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. గతేడాదే 'కాంతార-2' కూడా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ మధ్యే వచ్చిన టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్.

అయితే అంతా అనుకుంటున్నట్లు ఇది సీక్వెల్ మాత్రం కాదు.. ప్రీక్వెల్. కాంతార కథకి చాలా చరిత్ర ఉందని.. అసలు కథ అంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్.

సమ్మర్ 2024కి కాంతార ఏ లెజెండ్ రిలీజ్ ప్లాన్ చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా 2024 దసరాకు లేదంటే 2025 సంక్రాంతి సీజన్‌లో రావొచ్చని అంచనా. బడ్జెట్ లిమిట్స్ లేకుండా హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని 150 కోట్లతో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, బెంగాళీ, ఇంగ్లీష్‌లోనూ కాంతారా 2 విడుదల కానుంది. వచ్చే ఏడాది ఆస్కార్‌కు తమ సినిమాను పంపించాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. 🎬✨

bottom of page